ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎస్.యూ.వి వెహికల్ జనవరిలో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. దీని ధర 42.48 లక్షలుగా నిర్ణయించబడింది. సింగిల్ డీజిల్ ఇంజిన్ వర్షన్ తో ఈ వెహికల్ వస్తుంది. ఇంకా 9 స్పీడ్ ఆటోమెటెడ్ ట్రాన్స్ మిషన్స్ అందుబాటులోకి వస్తుంది. 2.0 లీటర్ ఇంజిన్ కెపాసిటీతో 147 బిహెచ్పి పవర్, 382 ఎన్.ఎం టార్క్ తో ఈ వెహికల్ వస్తుంది. 


2018 లో ల్యాండ్ రోవర్ నుండి వస్తున్న ఈ డిస్కవరీ స్పోర్ట్ మార్కెట్ ను శాసిస్తుందని అంటున్నారు. ఎన్నో లక్సరీ ఫీచర్స్ ను జోడించి ఈ వెహికల్ అందుబాటులోకి వస్తుంది. సురక్షితమైన ఇంకా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ ల్యాండ్ రోవర్ డిస్కవర్ స్పోర్ట్ రాబోతుంది. ఇక దీనికి పెట్రోల్ వర్షన్ వర్షన్ మాత్రం ప్రస్తుతం సిద్ధంగా లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: