ఇయర్ ఎండింగ్ సేల్ తో మోటార్ సంస్థలకు మంచిగా కలిసి వచ్చిందని చెబుతున్నాయి సేల్స్ వర్గాలు. డిసెంబర్ నెలలో వాహన కొనుగోళ్ల శాతం చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. డిసెంబర్ నెలలో భారీ డిస్కౌంట్లతో వాహన విక్రయాలు జరిపారు. అందుకే ఎక్కువ సేల్స్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇక డిసెంబర్ లో మారుతి సుజుకి 10 శాతం సేల్స్ పెరిగినట్టు ప్రకటించింది.


ఈ క్రమంలో డిసెంబర్ నెలలో హోండా 26%, టివిఎస్ మోటార్స్ 39% వృద్ధిరేటు సాధించాయి. డిసెంబర్ నెలలో హోండా కార్లు 12, 642 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక టివిఎస్ అయితే కేవలం డిసెంబర్ ఒక్క నెలలో 2.47 లక్షల యూనిట్ల బైక్ లను అమ్మినట్టు తెలుస్తుంది. మొత్తానికి 2017 చివరి నెలలో లాభదాయకంగా మోటార్ అమ్మకాలు ఉన్నట్టు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: