2018 లో జరుగనున్న ఆటో ఎక్స్ పో ప్రదర్శనలో యమహా నుండి రెండు కొత్త మోడల్స్ ప్రదర్శనకు రానున్నాయని తెలుస్తుంది. రాబోతున్న యమహా బైకులలో ఒకటి ఆర్ 15, 3వ వర్షన్ అని తెలుస్తుండగా.. మరోటి ఆర్3 మోడల్ అని అంటున్నారు. ఆర్ 15, 3వ వర్షన్ వి3.0 కొన్ని అధునాతన మార్పులతో రాబోతుందట. ఇక దీని ధర 1.25 లక్షల నుండి 1.30 లక్షల దాకా ఉంటుందని తెలుస్తుంది. 19.5పిఎస్ పవర్, 15 ఎన్నెం టార్క్ తో ఈ వెహికల్ అందుబాటులో వస్తుంది.


ఇక ఆర్3 వెహికల్ కూడా 3.3 నుండి 3.5 లక్షల ధరతో వస్తుంది. యూరో 4 మోడల్ తో వస్తున్న ఈ ఆర్3 బిఎస్-4 నామ్స్ తో అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ వెహికల్ 321 సిసి కెపాసిటీతో వస్తుందని అంటున్నారు. 42 పిఎస్ పవర్, 29 ఎన్నెం టార్క్ తో ఈ బైక్ వస్తుంది. మొత్తానికి 2018లో యమహా కొత్త రకం బైక్ మోడళ్లతో కస్టమర్స్ కు మరింత ప్రియం కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: