లక్సరీ వెహికల్స్ లో లాండ్ రోవర్ బ్రాండ్ కు ఉన్న వాల్యూ అందరికి తెలిసిందే. ఇప్పటికే తమ వెహికల్స్ తో ఇండియా మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్న లాండ్ రోవర్ ఇప్పుడు ఇండియాలో సరికొత్త మోడల్ కారుని రిలీజ్ చేస్తుంది. రేంజ్ రోవర్ వెలార్ పేరుతో 78. 83 లక్షల విలువ గల కారుని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది లాండ్ రోవర్. 


ఇక ఈ వెహికల్ బి.ఎం.డబల్యు ఎక్స్ 5, ఆడి క్యూ7, వోల్వో ఎక్స్ సీ 90 మోడల్ లా ఉంటూ వాటికి గట్టి పోటీ ఇస్తుందట. వెంలార్ మోడల్ కారు 2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటుగా 178 బిహెచ్పి.. 430 ఎన్నెం టార్క్ లేదా 237 బిహెచ్పి.. 500 ఎన్నెం టార్క్ ఫీచర్స్ తో అందుబాటులో వస్తుంది. 


3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో కూడా వస్తున్న ఈ వెహికల్ 296 బిహెచ్పి.. 700 ఎన్నెం టార్క్ కలిగి ఉంటుంది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కు 247 బి.హెచ్పి.. 365 ఎన్నె టార్క్ లేదా 296 బిహెచ్పి.. 400 ఎన్నెం టార్క్ తో వస్తుంది. అన్ని ఇంజిన్ లకు జెడెఫ్ 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: