రెనో క్విడ్ నుండి సూపర్ హీరో ఎడిషన్ ఇప్పుడు ఇండియా మార్కెట్ లో కూడా రిలీజ్ అయ్యింది. 4.34 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ వెహికల్ వస్తుంది. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ స్పూర్తితో ఈ వెహికల్ తయారు చేయడం జరిగింది. రెనో క్విడ్ భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న సందర్భంగా ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వర్షన్స్ లో ఈ వెహికల్ తయారవుతుంది.


రెగ్యులర్ క్విడ్ తో పోలిస్తే కొన్ని సరికొత్త అప్డేట్స్ వచ్చాయని తెలుస్తుంది. ముఖ్యంగా బాడీ గ్రాఫిక్స్ లో మార్పులు చేశారట. ఐరన్ మ్యాన్ ఎడిషన్ క్యాబిన్ లో రెడ్ కలర్ కన్సోల్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ లో బ్లూ కలర్ కన్సోల్స్ ఉంటాయట. 1.0 లీటర్ ఇంజిన్ తో ఆరెస్టి ఆప్షన్ లో లభిస్తుందట. అయితే ఆరెస్టీ ఆప్షన్ కోసం మరో 29000 ఎక్స్ ట్రా చెల్లించాల్సి ఉంటుందట.


1.0 లీటర్ ఇంజిన్ తో 67 బిహెచ్పి పవర్ తో ఈ వెహికల్ వస్తుంది. ఐదు గేర్లు మ్యాన్యువల్ తో పాటుగా ఆటోమేటిక్ గేర్స్ బాక్స్ తో ఇది వస్తుంది. రెనో క్విడ్ నుండి రాబోతున్న ఈ సూపర్ హీరో ఎడిషన్ మార్కెట్ లో సరికొత్త మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: