2018లో బజాజ్ నుండి 3 కొత్త రకం బైకులను రిలీజ్ చేస్తుంది బజాజ్ అవెంజర్. ప్రస్తుతం ఉన్న మోడల్స్ ను కొనసాగిస్తూ.. కొత్తగా బజాజ్ 220 స్ట్రీట్, అవెంజర్ 220 క్రూయిజర్, అవెంజర్ 150 స్ట్రీట్ వెహికల్స్ ను రిలీజ్ చేస్తుంది బజాజ్. ఇక ఇవే కాకుండా అవెంజర్ 180 స్ట్రీట్ బైక్ మోడల్ ను రిలీజ్ కు సిద్ధం చేసిందట బజాజ్.


83, 987 ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తున్న ఈ బజాజ్ 180 స్ట్రీట్ బైక్ కొద్ది వారాల్లో ఇండియా మార్కెట్ లోకి వస్తుందట. 220 సిసి కెపాసిటీతో అవెంజర్ 150 మోడల్ తో సరికొత్త 180 స్ట్రీట్ వస్తుంది. డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్, బాడీ గ్రాఫిక్స్, డీకాల్స్ వంటివి కొత్తగా వస్తున్నాయి. 


5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న ఈ బైక్ 17 బి.హెచ్.పి పవర్, 14.22 ఎన్.ఎం టార్క్ తో వస్తుంది. అవెంజర్ ను ఇష్టపడిన కస్టమర్స్ కు ఈ సరికొత్త 180 స్ట్రీట్ కూడా నచ్చుతుందని అంటున్నారు. సరికొత్త అధునాత టెక్నాలజీ అప్డేట్స్ తో ఈ మోడల్ బయటకు వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: