ఇండియాలో రెండవ అతిపెద్ద దిగ్గజ కార్ల కంపెనీ అయిన హ్యుండై మోటార్స్ ఇండియాలో 2018 క్రెటా ఎస్.యు.వి ని రిలీజ్ చేయాలని చూస్తుంది. హ్యుండై క్రెటీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ త్వరలోనే ఇండియన్ రోడ్ల మీద పరుగులు తీయనుంది. ఇప్పటికే రోడ్ల మీద పరిక్షించబడిన క్రెటా త్వరలో అఫిషియల్ రిలీజ్ కాబోతుంది.


ఇక దీని ఫీచర్స్ విషయానికొస్తే.. 1.6 లెటర్ పెట్రోల్, 1.4 డీజిల్ ఇంకా 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లు ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో వస్తున్నాయి. పెట్రోల్ ఇంజిన్ 121 బి.హెచ్.పి పవర్ ఇంకా 154 ఎన్నెం టార్క్ తో వస్తుండగా.. 1.4 డీజిల్ ఇంజిన్ 89 బిహెచ్పి పవర్ ఇంకా 224 ఎన్నెం టార్క్ తో వస్తుంది. 1.6 డీజిల్ ఇంజిన్ 126 బిహెచ్పి పవర్ ఇంకా 256 ఎన్నెం టార్క్ ప్రొడ్యూ చేస్తుంది. 


మొత్తానికి తనదైన స్పెషల్ ఫీచర్స్ తో రెగ్యులర్ కస్టమర్స్ తో పాటుగా హ్యుండై తమ అధునాతన టెక్నిక అప్డేట్స్ తో వాహన ప్రియులను ఉత్సాహపరుస్తుంది. మరి ఈ క్రెటా ఫీచర్స్ అదరగొడుతుండగా ఆఫ్టర్ రిలీజ్ దీని సేల్ ఏవిధంగా ఉండబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: