హోండా నుండి స్కూటర్ విభాగంలో వచ్చిన యాక్టివా 3జి, 4జి వెహికల్స్ బాగా సేల్స్ అవడంతో ఇప్పుడు సరికొత్త టెక్నికల్ అప్డేట్స్ తో 5జి యాక్టివా మోడల్ ను రిలీజ్ చేస్తున్నారు. దీని ధర 52,460 రూపాలౌగా ఢిల్లి ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉంచారు. ఈమధ్యనే జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో ఈ హోండా యాక్టివా 5జి మోడల్ ను ఉంచారు.


ఇక ఈ సరికొత్త యాక్టివా 5జి రెండు వేరియెంట్లలో అందుబాటిలోకి వస్తుంది. అందులో ఒకటి యాక్టివా 5జి ఎస్.టి.డి మరోటి యాక్టివా 5జి డి.ఎల్.ఎక్స్ వేరియెంట్. టెక్నికల్ గా అంత అప్డేషన్ లేకున్నా సరే 109.19 సిసి కెపాసిటీతో పాటుగా పెట్రోల్ ఇంజిన్ 7500 ఆర్.పి.ఎం ఇంజిన్ వేగం ఉంటుంది. అంతేకాకుండా 8 బిహెచ్పి పవర్ ఇంకా 5500 ఆర్.పి.ఎం తో 9 ఎన్నెం టార్క్ కూడా వస్తుంది.


83 కిలోమీటర్ల వరకు గరిష్ట వేగంతో దూసుకెళ్ల గల సత్తా ఉన్న స్కూటర్ గా ఈ మోడల్ తయారు చేయబడింది. ఇక ఈ యాక్టివా 5జి మోడల్ 8 సరికొత్త రంగులలో రాబోతుంది. హోండా స్కూటర్స్ లో సక్సెస్ ఫుల్ గా అమ్ముడవుతున్న ఈ యాక్టివా కస్టమర్స్ కు తమ సేవలను మరింత సౌకర్యవంతంగా అందించేలా ప్లాన్ చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: