2018లో సుజుకి రెండు కొత్త బైకులను రిలీజ్ చేసింది. జిక్సర్ తో పాటుగా కొత్త జిక్సర్ ఎసెఫ్ మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది సుజుకి. ఇక ఈ సరికొత్త జిక్సర్ ధర 80,900 ఉండగా.. జిక్సర్ ఎసెఫ్ మాత్రం 90,037 రూపాయల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. ఫుల్ టెక్నికల్ అప్డేట్స్ తో వచ్చిన ఈ బైక్ వాహనదారులను ఆకర్షిస్తున్నాయి.


క్యాండీ సోనోమా రెడ్, మెటాలిక్ సోనిక్ సిల్వర్ రంగుల్లో ఈ రెండు బైకులు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు బైక్ మోడల్స్ 155సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌ తో రావడం విశేషం. ఇక ఇంజిన్ కెపాసిటీ విషయానికొస్తే 8000 ఆర్పీఎం వద్ద అత్యధికంగా 14.5 బీహెచ్‌పీని రిలీజ్ చేస్తుంది. ముందు వెనుక డిస్క్ బ్రేకులు ఈ బైకుల యొక్క ప్రాధాన్యత. 


కచ్చితంగా ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బైకులకు ఈ సరికొత్త సుజుకి జిక్సర్ మోడళ్లు పోటీ ఇస్తాయనడంలో సందేహం లేదు. ఈ మోడల్ సోల్స్ ను బట్టి ఇంకా మరో రెండు మోడళ్లను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తుంది సుజుకి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: