బజాజ్ నుండి ఓ సరికొత్త బైక్ మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుంది. ఎప్పటికప్పుడు కస్టమర్స్ కు సరికొత్త మోడల్స్ అందించే బజాజ్ మార్కెట్ లోకి సరికొత్త 180 స్ట్రీట్ పేరుతో ఓ బైక్ రిలీజ్ చేసింది. ఈ బైక్ డిజైన్ గత మోడల్స్ తో పోలి ఉన్నా చిన్న చిన్న ఎల్.ఈ.డి డేటైం రన్నింగ్ ల్యాంప్ లు అదనంగా వచ్చాయి.


180 సిసి సామర్ధ్యంతో వస్తున్న ఈ బైక్ ఇంజిన్ బజాజ్ పల్సర్ 180కి పోటీగా ఉండబోతుందని అంటున్నారు. ఇక దీని టార్క్ చాలా శక్తివంతంగా ఉంటుందట. పికప్ కూడా చాలా త్వరగా ఉంటుందని అంటున్నారు. ఇక ఎలాంటి రోడ్ల మీద అయినా సరే ఈ బైక్ దూసుకెళ్తుందని అంటున్నారు.


రైడింగ్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. వీల్ బేస్ కూడా చాలా పొడవుగా ఉంటుందట. 260 ఎం.ఎం డిక్స్ బ్రేక్ ఇంకా 130 ఎం.ఎం డ్రం బ్రేక్ లాంటివి ఈ బైక్ ప్రత్యేకతలని చెబుతున్నారు. మరి కొత్త వెహికల్ తీసుకునే ఆలోచనలో ఉన్న వారు బజాజ్ బైక్ ను ట్రై చేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: