టివిఎస్ నుండి అపాచి ఆర్.టి.ఆర్ 180 కేవలం ట్రావెలింగ్ కోసం మాత్రమే టూ వీలర్ వచ్చింది. ఇప్పుడు ఇదే అపాచి ఆర్.టి.ఆర్ 180 రేస్ ఎడిషన్ ను రిలీజ్ చేసింది. రేసింగ్ అంటే ఇష్టం ఉన్న కస్టమర్స్ కోసం ఈ సరికొత్త అపాచి ఆర్.టి.ఆర్ 180 రేస్ బైక్ బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 83,233 రూపాయల ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉంది.


ఇక ఈ సరికొత్త అపాచి బైక్ వైట్ కలర్ లో అందుబాటులోకి వచ్చింది. లైట్ వెయిట్ తో రేసింగ్ కు ఎంతో అనువుగా ఉండేలా ఈ బైక్ మోడల్ ఉంటుంది. ఇక ఈ బైక్ తో త్రీడి టివిఎస్ లోగో వస్తుంది. అల్లాయి వీల్స్ బ్రాండెడ్ స్టిక్కారింగ్ ఫెసిలిటీ ఇస్తుంది. అంతేకాదు ఈ బైక్ కు ముందు, వెనుక రెండిటికి డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు.


177.4 సిసి ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటుగా 16.3 బిహెచ్పి పవర్ ఇంకా 15.5 ఎన్నెం టార్క్ తో అందుబాటులో ఉంటుంది. జీరో నుండి 60 కిలోమీటర్ల స్పీడ్ 4.96 సెకన్లలో అందుకుంటుంది. కచ్చితంగా టివిఎస్ కస్టమర్స్ కు ఈ సరికొత్త రేసర్ ఆర్.టి.ఆర్ 180 మెప్పు పొందుతుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: