దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్నారు రవాణా యంత్రాంగం. ఇందుకోసం వాటిని డీజిల్, పెట్రోల్ వేరియెంట్ల నుండి సెపరేట్ గా గుర్తించేలా వాటికి గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లు ఇస్తున్నారట. డీజిల్, పెట్రోల్ వెహికల్స్ నుండి వీటిని వేరు చేసేలా ఈ నెంబర్ ప్లేట్లు సహకరిస్తాయి. 


ఇప్పటివరకు పెట్రోల్, డీజిన్ల్ వాహనాలకు ఒకేరకమైన నెంబర్ ప్లేట్ విధానం ఉండేది. వ్యక్తిగత అవసరాలకు వాడుకునే వెహికల్స్ గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ మీద వైట్ కలర్ నెంబర్లు ఉంటాయి. ఇక ట్యాక్సీ కోసం వాడే ఎలెక్ట్రిక్ వెహికల్స్ కు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ మీద యెల్లో రంగులో నెంబర్స్ వేసి ఉంటాయి. 


ఇండియన్ రోడ్ల మీద తిరిగే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అది బస్సు, కారు, ఆటో ఎలాంటిదైనా సరే ఇలాంటి నెంబర్ ప్లేట్ విధానం అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాటా, మహింద్రా మాత్రమే ఎలెక్ట్రిక్ వెహికల్స్ అది కూడా వాణిజ్య అవసరాలకు అనుగుణంగా విడుదల చేసింది. రానున్న రోజుల్లో అన్ని మోటార్ కంపెనీలు ఈ ఎలెట్రిక్ వెహికల్స్ మీద దృష్టి పెడుతున్నాయని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: