లక్సరీ కార్ల తయారు సంస్థ బిఎండబల్యు నుండి త్వరలో మోటార్ బైకులు కూడా ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. బిఎండబల్యు నుండి డి310ఆర్ ఇంకా జి310 బైకులు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఆటో ఎక్స్ పో 2018 ప్రదర్శనలో ఈ వెహికల్స్ చూపరులను ఆకట్టుకున్నాయి.


అయితే ఈ బైక్ పిక్స్ ఇప్పుడు లీక్ అవడంతో బిఎండబల్యు కస్టమర్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఈ బైకుల ఉత్పత్తిని మొదలు పెట్టగా త్వరలో ఇవి మార్కెట్ లోకి రిలీజ్ అవనున్నాయి. 313 సిసి కెపాసిటీ కలిగిన ఈ బైకులు అత్యంత అధునాతన సాంకేతికతో రాబోతున్నాయి.


6-స్పీడ్ గేర్స్ తో 33.5 బిహెచ్పి పవర్ మరియు 28 ఎన్.ఎం టార్క్ తో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. టివిఎస్ అపాచే ఆర్ 310కు ఈ ఇంజిన్ సామర్ధ్యమే ఉంటుంది. లక్సరీ బైక్ కావాలనుకునే వారు రాబోతున్న బిఎండబల్యు బైకుల మీద ఓ లుక్కేయండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: