వినేందుకు కాస్త విచిత్రంగా ఉన్నా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ అదికూడా 100సిసి కెపాసిటీతో రావడం ఏంటని అంటే ఇండియన్ రాయల్ బ్లాట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఇమిటేట్ చేస్తూ బైక్ ను రిలీజ్ చేస్తుంది. రాయల్ బ్లాట్ 100 అనే చిన్న బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ ను ఇమిటేట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.


భువనేశ్వర్ కు చెందిన రాయల్ ఉడో డిజైనింగ్ కంపెనీ మోడిఫైడ్ చేసిందని తెలుస్తుంది. రాయల్ ఇండియన్ అనే మోడల్ తో ఇది ప్రచారంలోకి వచ్చింది. అయితే దీని నమూనా కోసం ఏ బైక్ ను వాడారో మాత్రం తెలియలేదు. ఫ్యుయల్ ట్యాంక్ మీద రాయల్ ఎన్ ఫీల్డ్ ఉండాల్సింది రాయల్ ఇండియన్ అని ఉంది.


ఇమిటేట్ మాత్రమే కదా అని చీప్ గా కాకుండా అచ్చం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఎలా ఉంటుందో అలా దీన్ని డిజైన్ చేశారు. కాని 100 సిసి కెపాసిటీ బైక్ కావడంతో ఇది వెనుకపడే అవకాశం ఉంది. బుల్లెట్ ఫీల్ ను ఏమాత్రం మిస్ కానివ్వకుండా లుక్ తో పాటు సీట్ ను కూడా అదే విధంగా ఉంచారు. మరి దీనిపై అధికారిక గుర్తింపు ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: