ఆంపియర్ ఎలెక్ట్రిక్ వెహికల్స్ ఇండియన్ మార్కెట్ లోకి మరో రెండు సరికొత్త ఎలెక్ట్రిక్ వెహికల్స్ ను రిలీజ్ చేసింది. సోయంబత్తూరుకి చెందిన ఈ ఆంపియర్ ఎలెక్ట్రిక్ వెహికల్ కంపెనీ వి 48 మరియు రియోలి-అయాన్ ఎలెక్ట్రిక్ స్కూటర్స్ ను రిలీజ్ చేసింది. ఇక వీటి ధరల విషయానికొస్తే ఆంపియర్ వి-48 ధర 38,00లు కాగా రియోలి-అయాన్ ధర 46,000లు ఎక్స్ షోరూం ప్రైజ్ గా నిర్ణయించారు.


ఇక ఈ వెహికల్స్ యొక్క అదనపు విషయాలేంటంటే ఈ వెహికల్స్ నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అంతేకాదు వీటికి రిజిస్ట్రేషన్ లేకుండా కూడా నడిపించుకునే అవకాశం ఉంది. అంటే వీటికి అసలు నెంబర్ ప్లేట్ సౌకర్యమే లేదన్నమాట. వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది నిజం.


వి-48 వెహికల్ 250 వాట్స్ బ్రష్ లెస్ డిసి మోటార్ తో వస్తుండగా.. ఇది 100 కిలోల బరువు మోయగలదు. ఇక రియో లీ అయాన్ మాత్రం 120 కిలోల బరువు మోయగలదు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 నుండి 70 కిలోమీటర్ల దాకా వెళ్లగలదు. ఈ రెండు వెహికల్స్ 4 నుండి 5 గంటల్లో ఫుల్ చార్జింగ్ చేయొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: