హీరో మోటో కార్ప్ నుండి ఎలెక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా మోటార్ కంపెనీల కన్నా మెరుగైన విధంగా హై స్పీడ్ తో ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్స్ హీరో నుండి రాబోతున్నాయని తెలుస్తుంది. రాబోతున్న ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్స్ మోడల్ ఇంకా పర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నాయని తెలుస్తుంది.


ఎలెక్ట్రిక్ స్కూటర్స్ అంత పికప్ ఉండవు.. పర్ అవర్ 50 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే ఎక్కువే. పెట్రోల్ టూ వీలర్స్ కు పోటీగా ఎలెక్ట్రిక్ స్కూటర్స్ వేగం ఉంటే అన్న ఆలోచనతోనే హీరో రాబోతున్న సరికొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్స్ కు హై స్పీడ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. హీరో నుండి ఎలెక్ట్రిక్ స్కూటర్ విభాగంలో AXHLE-20 మార్కెట్ లో రిలీజ్ కాబోతుంది.  


ఈ స్కూటర్ హై స్పీడ్ సెగ్మెంట్ తో మార్కెట్ లోకి రాబోతుంది. టాప్ ఎండ్ మోడల్ తో అత్యంత ఖరీదైన స్కూటర్ గా ఈ స్కూటర్ రాబోతుంది. హీరో నుండి మూడు రకాల ఎలెక్ట్రిక్ స్కూటర్స్ రాబోతున్నాయి. నిక్స్, ఫోటాన్, ఫోటాన్ 72వి మోడల్స్ తో మార్కెట్ లోకి హై స్పీడ్ వెహికల్స్ గా రానున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: