దేశీయ దిగ్గజ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలో పెగాసన్ 500 మోడల్ ను రిలీజ్ చేస్తుంది. 2.49 లక్షల విలువల గల ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ పెగాసన్ లిమిటెడ్ ఎడిషన్ గా రాబోతుంది. ఇండియాలో కేవలం 250 యూనిట్లు మాత్రమే రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైకులను రిలీజ్ చేస్తుంది.


సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటీష్ సైనికులు వాడిన ఫ్లైయింగ్ ఫ్లీ బైకు ప్రేరణతో రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసన్ 500 లిమిటెడ్ ఎడిషన్ బైక్ రెడీ చేయడం జరిగింది. ఆర్.ఈ/డబల్యుబి 125-2 స్ట్రోక్ బైకు ఫ్లైయింగ్ ఫ్లై పేరుతో బాగా వాడుకలో ఉంది. 499 సిసి కెపాసిటీతో గాలితో త్వరగా చల్లబడే సింగిల్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది.


5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న ఈ బైక్ 27.2 బిహెచ్పి పవర్ ఇంకా 41.2 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ పక్కా మిలిటరీ బైక్ గా వస్తుంది. కచ్చితంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసన్ 500 మోటార్ బైకులలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: