బజాజ్ నుండి సరికొత్త పల్సర్ 150 క్లాసిక్ బైక్ రిలీజ్ కాబోతుంది. రెగ్యులర్ బజాజ్ పల్సర్ 150 బైకు కన్నా దీని ధర తక్కువగా ఉండటం విశేషం. బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ ధర 67,437 ముంబై ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. ఫీచర్స్ విషయంలో బజాజ్ పల్సర్ 150 కన్నా 150 క్లాసిక్ లో తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.


బజాజ్ వెహికల్స్ ను తక్కువ ధరకే కస్టమర్స్ కు అందించే ఆలోచనలో భాగంగా ఈ క్లాసిక్ వేరియంట్లను తయారు చేయడం జరిగిందట. అయితే దీని కోసం యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం మాత్రం అందుబాటులో ఉంది. బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ ప్రస్తుతం బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంది. 2019 లో మరికొన్ని కలర్స్ అందుబాటులోకి వస్తాయట.


ఇక టెక్నికల్ గా చూస్తే 150సిసి కెపాసిటీ గల పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఈ 150 క్లాసిక్ 8000 ఆర్.పి.ఎం ఇంజిన్ వేగం వద్ద 14 బిహెచ్పి పవర్, 6000 ఆర్.పి.ఎం వద్ద 13.4 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలిగిన ఈ బైక్ ఫ్రెంట్ వీల్ డిస్క్ బ్రేక్, బ్యాక్ వీల్ డ్రం బ్రేక్ తో వస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: