బ్రిటన్ కార్ల తయారీ సంస్థ ఎం.జీ మోటార్స్ ఇప్పుడు చైనాకు చెందిన ఎస్.ఏ.ఐ.సీ కంపెనీని సొంతం చేసుకుంది. 2019లో ఇండియా మార్కెట్ లోకి ఆరెక్స్5 కార్లను ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఎక్స్ టీరియర్ ఏమాత్రం కనబడకుండా ఆరెక్స్-5 పూణె రోడ్ల మీద టెస్ట్ రైడ్ చేశారట.


ఇంటర్నేషనల్ మార్కెట్ లో గట్టి పోటీ ఇస్తున్న ఆరెక్స్-5 కారు ఇండియన్ రోడ్ల మీద తిరగబోతుంది. అయితే ఇండియాలో రిలీజ్ అయ్యే నాటికి కొన్ని టెక్నికల్ అప్డేట్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది. 1.5 లీటర్ పెట్రోన్ 166బిహెచ్పి పవర్ ఇంకా 250 ఎన్.ఎం టార్క్ తో పాటుగా 2 లీటర్స్ కలిగిన నాలుగు పెట్రోన్ ఇంజిన్ లు ఈ మోడల్ తో వస్తున్నాయి.


6 లేదా 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ ఉంటాయి. ప్రస్తుతం ఎంజి మోటార్స్ నుండి రాబోతున్న ఆరెక్స్-5 ఇండియన్ మార్కెట్ లో తన ప్రభావం చూపించాలని చూస్తుంది. మరి రిలీజ్ తర్వాత ఈ వాహనాల సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: