హోండా మోటర్ సంస్థ కొత్తరకం 2018 యాక్టివాను రిలీజ్ చేసింది. హోండా స్కూటర్స్ లో యాక్టివా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. మోటార్ సైకిల్స్ లో మాత్రమే కాదు స్కూటర్స్ విభాగంలో హోండా మోటార్స్ ప్రతిష్ఠ పెంచిన హోండా ఇప్పుడు 2018లో కొత్త యాక్టివా లాంచ్ చేసింది. 


హోండా 2018 యాక్టివా 125 సిసి ప్రారంభ ధర 59,621 రూపాయలు ఎక్స్ షోరూం ప్రైజ్ గా నిర్ణయించబడింది. 2018 హోండా యాక్టివా 125 మూడు వేరియెంట్ల లో రిలీజ్ అవుతుంది. 2018 హోండా యాక్టివా 125 డ్రమ్ బ్రేక్ వేరియెంట్ ధర 59,621. యక్టివా 125 డ్రమ్ బ్రేక్ అల్లాయి వీల్స్ ధర 61,558 గా నిర్ణయించబడింది.      


2018 125 డిస్క్ బ్రేక్ వేరియెంట్ ధర 64,007 లుగా నిర్ణయించారు. మొత్తానికి హోండా యాక్టివా 125 కొత్త సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైంది. హోండా యాక్టివా 5జి మోడల్ లానే ఇది లాంచ్ అయ్యింది. దీని సేల్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: