బజాజ్ నుండి ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ మెటల్ తో తయారైన వి12 బైక్ తొలగించాలని నిర్ణయించింది. అయితే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఈ బైక్ మ్యాను ఫ్యాక్చరింగ్ ఆపేస్తున్నారట. తర్వాత మళ్లీ బజాజ్ వి12 బైక్ రిలీజ్ చేస్తుందట. 2018 ప్రారంభం నుండి వి12 సేల్స్ బాగా పడిపోయాని బజాజ్ ఈ నిర్ణయం తీసుకుంది.  


గడిచిన సంవత్సరం ఎలా ఉన్నా 2018లో ఇప్పటివరకు ఒక్క వి12 బైక్ సేల్ అవలేదట. అందుకే మార్కెట్ లో ఉన్న బైక్ లను అమ్మేసి ఇక వీటి బుకింగ్స్ ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మీదట వి12 బైక్ కావాలని అడిగినా డీలర్స్ కష్టమే అని చెబుతారట. బజాజ్ వి12 బదులుగా వి 15, బజాజ్ డిస్కవర్ 125 సిసి బైక్ వీటి స్థానంలో రానున్నాయి.  


బైక్ సేల్స్ లో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ తో కలిసి రిలీజ్ చేసిన బైకులలో వి 12 ఏమాత్రం క్లిక్ అవలేదు. అయితే అదే లుక్ తో వస్తున్న వి -15 బైకుల సేల్స్ మాత్రం బాగానే ఉన్నాయి.   



మరింత సమాచారం తెలుసుకోండి: