హోండా నుండి మైలేజ్ బైక్ గా సిడి-110 డ్రీమ్ డిఎక్స్ రిలీజ్ చేసింది. 2018లో కొత్త మోడల్ గా హోండా నుండి ఈ మోడల్ రిలీజ్ చేయడం జరిగింది. 2018 హోండా సిడి-110 డ్రీమ్ డిఎక్స్ ధర రూ. 48, 272 ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. ఈ సరికొత్త మోడల్ లో డ్రీమ్ డిఎక్స్ లో కాస్మొటిక్స్ అప్డేట్స్ జరిగాయని తెలుస్తుంది.


ఈ మోడల్ అట్రాక్టిల్ గోల్డ్ కలర్ గ్రాఫిక్స్, క్రోం మఫ్లర్ ప్రొటెక్టర్ తో అందుబాటులోకి వస్తుంది. హెవీ డ్యూటీ క్యారియర్ ను ఇందులో వాడటం జరిగింది. 110 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ సింగిల్ సిలిండర్ హోండా ఈకో టెక్నాలజీతో ఇంజిన్ వస్తుంది. 4 గేర్స్ తో వస్తున్న ఈ బైక్ 8.31 బిహెచ్పి పవర్ ఇంకా 9.09 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.


హోండా నుండి సిడీ మోటార్స్ 1966 నుండి కొన్ని కోట్ల మంది వాహన దారులు వాడుతున్నారని. దానికి కొనసాగింపుగా హోండా డ్రీమ్ 110 సిడి డిఎక్స్ ను రిలీజ్ చేయడం జరిగిందని తెలుస్తుంది. 2014 లో 100 డ్రీమ్ బైక్ రిలీజ్ చేయగా ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ బైక్ వస్తుంది. 8 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ గల ట్యాంక్ తో ఈ బైక్ వస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: