మధ్యతరగతి మనిషికి కారుని చౌకగా అందించాలనే ఉద్దేశంతో టాటా నుండి నానో కారు వచ్చింది. కారు సొంతం చేసుకోవాలనుకునే కొంతమందికి అది బాగా నచ్చింది. అయితే అదే తరహాలో టాటా నుండి హైబ్రిడ్ కాన్సెప్ట్ లో మరో కారు రాబోతుంది. అదే టాటా మెగా పిక్సెల్. 2017 మార్చిలో జెనివాలో ఇది ఆవిష్కరించారు రతన్ టాటా.   


ఎలెక్ట్రిక్ బ్యాటరీలతో, పెట్రోల్ తో ఈ కారు రన్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్ కోసం ఈ కారుని తయారు చేయడం జరిగింది. తర్వాత ఇండియాలో కూడా ఈ మోడల్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. టెక్నికల్ గా పిక్సెల్ కాన్సెప్ట్ తో మెగా పిక్సెల్ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారు తయారు చేయడం జరిగింది.


ఫుల్ చార్జింగ్ అయిన బ్యాటరీతో 54 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. ఈ వెహికల్ యూక గరిష్ట వేగం 100 కి.మీ. బ్యాటరీ చార్జింగ్ అయిపోతే 325 సిసి కెపాసిటీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వెహికల్ వాడుకోవచ్చు. పెట్రోల్ ట్యాంక్ ఒకసారి ఫుల్ చేస్తే 900 కి.మీ తిరగవచ్చు. బ్యాటరీ, పెట్రోల్ రెండిటితో కలుపుకుంటే ఈ వెహికల్ 100 కి.మీ మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: