జపనీస్ మోటార్ సంస్థ సుజుకి నుండి సరికొత్త బందిత్ 150సిసి బైక్ 2018 గైకిండో ఇండోనేషియా ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించడం జరిగింది. జకర్తా వేదికగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్ పోలో సుజుకి 2018 బందిత్ 150 బైక్ చూపరులను ఆకట్టుకుంది. ఇది సుజుకి జి.ఎస్.ఎక్స్-ఎస్ 150 తర్వాత మోడల్ గా రిలీజ్ అవుతుంది.


147.3 సిసి కెపాసిటీతో లిక్విడ్ కూల్ డి.ఓ.హెచ్.సి సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో ఈ బైక్ వస్తుంది. 19.2 బి.హెచ్.పి పవర్, 14 ఎన్.ఎం టార్క్ తో ఈ బైక్ వస్తుంది. సుజుకి నుండి వచ్చిన అన్ని 150 సిసి కెపాసిటీ కల ఇంజిన్ లో ఇది అత్యంత శక్తివంతమైనదని చెప్పొచ్చు. 


సుజుకి టూ వీలర్స్ ఈమధ్య భారతీయ మార్కెట్ లో కూడా సేల్ రేటుని పెంచుకున్నాయి. సుజుకి జిక్సర్ మోడల్ తో పాటుగా స్కూటర్ విభాగంలో కూడా సుజుకి బైకులను కొంటున్నారు. మరి ఈ సుజుకి మోడల్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: