యమహా నుండి పవర్ బైక్ లతో పాటుగా స్కూటర్ విభాగంలో వస్తున్న స్కూటర్స్ కూడా మంచి సేల్స్ కలిగి ఉంటున్నాయి. ఇప్పటికే యమహా రే జెడ్ ఆర్ సేల్స్ బాగానే ఉండగా ఆ స్కూటర్ అప్గ్రేడ్ ఎడిషన్ గా రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్ రిలీజ్ అయ్యింది. 57,898 ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ స్కూటర్ రిలీజ్ అవుతుంది.


ఈ ఏడాది ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించినబడిన యమహా రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. 113 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ 7.1 బి.హెచ్.పి పవర్, 8.10 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త యమహా రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ మిగతా కంపెనీల స్కూటర్స్ కు గట్టి పోటీ ఇస్తుంది.


ఈమధ్యనే రిలీజ్ అయిన ఈ స్కూటర్స్ దేశంలోని అన్ని యమహా డీలర్ షోరూమ్స్ లో అందుబాటులోకి వచ్చాయట. అగ్రెసివ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ యమహా స్కూటర్ విభాగంలో సేల్స్ ను పెంచుతుందని ఆశిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: