హోండా మోటార్ కంపెనీ నుండి లక్సరియస్ బైక్ గా వస్తుంది హోండా సిబీఆర్ 1000 ఆర్.ఆర్. టూ వేరియెంట్స్ లో వస్తున్న ఈ బైక్ 2019 ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. హోండా సిబీఆర్ 1000 ఆర్.ఆర్, సిబీఆర్ 1000 ఆర్.ఆర్ ఫైర్ బ్లేడ్ ఈ రెండు బైకులు హోండా ప్రతిష్ట పెంచుతాయని చెబుతున్నారు.


999సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ 191.6 బి.హెచ్.ఎం, 13000 ఆర్.పి.ఎం తో పాటుగా 114ఎన్.ఎం టార్క్ 11000 ఆర్.పి.ఎం ఎంజిన్ కెపాసిటీతో 6 స్పీడ్ గేర్స్ తో వస్తుంది. వీలీ కంట్రోలింగ్ సిస్టెంతో వస్తున్న ఈ బైక్స్ ఇదవరకు హోండా మోడల్స్ కన్నా ఎక్కువ టెక్నికల్ అప్డేట్స్ తో వచ్చిందని చెబుతున్నారు. 


హోండా సిబీఆర్ 1000 ఆర్.ఆర్ 16.43 లక్షలు కాగా.. ఫైర్ బ్లేడ్ వర్షన్ 19.28 లక్షలు ధర నిర్ణయించడమైనది. హోండా ప్రియులకు నచ్చేలా ఈ సరికొత్త మోడల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సిబీఆర్ ఈ ఎక్స్ టెంటెడ్ వర్షన్స్ తప్పకుండా లక్సరీ పీపుల్స్ కు నచ్చే ఫీచర్స్ తో వస్తున్నాయి. మరి ఈ బైక్ సేల్స్ ఎలా ఉండబోతాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: