హోండా నుండి యూనికాన్ 150 ఏ.బి.ఎస్ సిస్టెంతో కొత్త బైక్ రిలీజ్ అయ్యింది. ఇక దీని ధర విషయానికి వస్తే 78,815 ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఇది అందుబాటులోకి వస్తుంది. సేఫ్టీ నీడెడ్ అప్డేట్ గా 150 సిసి కెపాసిటీతో హోండా యూనికాన్ ఇప్పుడు ఏ.బి.ఎస్ సిస్టెంతో వస్తుంది.


ఇంజిన్ సామర్ధ్యం చూస్తే సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో 13 పి.ఎస్ పవర్, 12.8 ఎన్.ఎం టార్క్ తో ఈ బైక్ వస్తుంది. ఏప్రిల్ 1 నుండి ఏ.బి.ఎస్, సి.బి.ఎస్ బైకులు తప్పనిసరి కావడం చేత హోండా నుండి ఏ.బి.ఎస్ బైక్ మార్కెట్ లోకి వచ్చేసింది. హోండాలో సక్సెస్ ఫుల్ బైక్ అయిన యూనికాన్ ఇప్పుడు కస్టమర్స్ కోసం ప్రత్యేకమైన టెక్నికల్ అప్డేట్స్ తో ఈ బైక్ ను రిలీజ్ చేస్తుంది.


ఇండియాలో హోండా బైకులకు ఉండే సేల్స్ గురించి తెలిసిందే. హోండా నుండి సక్సెస్ అయిన యూనికాన్ ఇప్పుడు మరింత ప్రత్యేకతతో వస్తుంది. మార్కెట్ లోకి వచ్చిన ఈ సరికొత్త యూనికాన్ 150 ఏ.బి.ఎస్ సేల్స్ బాగుంటాయని చెప్పొచ్చు. మరి వీటి సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: