హోండా నుండి సరికొత్త అప్డేట్స్ తో హోండా సివిక్ టెన్త్ జెనరేషన్ వెహికల్ లాంచ్ అవుతుంది. సివిక్ వెహికల్ లోనే సరికొత్త అప్డేట్స్ తో హోండా సివిక్ సరికొత్త వర్షన్ రిలీజ్ అవుతుంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత హోండా సివిక్ ఇండియాలో లాంచ్ అవుతుంది. పెట్రోల్, డీజిల్ రెండిటిలో ఈ వెహికల్ అందుబాటులో ఉంది.  


1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న హోండా సివిక్ 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. 7.0 ఇంచెస్ డిస్ ప్లే.. ఎలెక్ట్రిక్ అడ్జెస్ట్ మెంట్ కలిగిన డ్రైవర్ సీట్ తో వస్తున్న ఈ వెహికల్ సన్ రూఫ్ తో కూడా అందుబాటులో తెస్తుంది. ఇక ఈ వెహికల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కొడా ఆక్టేవియా, హ్యుండై ఎలంత్రా, టొయోటా కొరొల్లాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. 


అల్లాయి వీల్స్, ఎల్.ఈ.డి హెడ్ ల్యాంప్స్ తో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సిస్టెం తో ఈ వెహికల్ వస్తుంది. మరి హోండా నుండి వస్తున్న ఈ సరికొత్త సివిక్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి. హోండా ప్రత్యేకమైన కష్టమర్స్ కోసం ఈ వెహికల్ వస్తుంది. మరి మార్చి 7న లాంచ్ అవుతున్న ఈ వెహికల్ ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: