ఫోర్డ్ ఫిగో ఫేస్ లిఫ్ట్ వెహికల్ మార్చి 15న మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. ఫ్రెంట్ లో కొద్దిపాటి మార్పులతో ఈ మోడల్ వెహికల్ వస్తుంది. 1.2 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటుగా 1.5 లీటర్ డీజిల్ వెహికల్ కూడా వస్తుంది. ఫోర్డ్ నుండి వస్తున్న ఈ సరికొత్త ఫిగో ఫేస్ లిఫ్ట్ వెహికల్ సేం ఫోర్డ్ కే.ఏ ప్లస్ మోడల్ లుక్ తో వస్తుంది.


5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ 3 సిలిండర్ తో 96 పిఎస్ పవర్, 120 ఎన్.ఎం టార్క్ తో వస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 5 లక్షల నుండి 7.5 లక్షల దాకా ఉంటుందని తెలుస్తుంది. ఇక మార్కెట్ లో ఉన్న మారుతి స్విఫ్ట్, గ్రాండ్ ఐ10, రీసెంట్ గా అప్డేట్ అయ్యి రిలీజ్ అయిన మారుతి ఐనిస్ కు పోటీ కానుంది.  


ఫోర్డ్ నుండి ఈ ఇయర్ రాబోతున్న ఫిగో ఫేస్ లిఫ్ట్ కోసం ఎంతోమంది ఫోర్డ్ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. మార్చి 15న మార్కెట్ లో రిలీజ్ అవబోతున్న ఈ వెహికల్ ఫోర్డ్ ప్రతి షోరూం లో అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఫోర్డ్ ఫిగో ఫేస్ లిఫ్ట్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: