టాటా మోటార్స్ తమ వాహనాల ధరని స్వల్పంగా పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ నుండి టాటా పాసెంజర్ వెహికల్స్ యొక్క ధరలు పెంచుతున్నారు.. మ్యాని ఫ్యాచర్ లో ఇంపుట్ కాస్ట్ పెరగడంతో పాటుగా ఎకనమిక్ కండీషన్స్ వల్ల కూడా టాటా వెహికల్స్ ధర పెంచుతున్నారట. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ ఇప్పటికే తమ వాహనాల మీద 4 శాతం రేటు పెంచారు,


టాటా మోటార్స్ ప్రతి పాసెంజర్ వెహికల్ కు 25000/- రూపాయలు పెంచుతున్నారని తెలుస్తుంది. టాటా నుండి నెక్సాన్  వెహికల్ లక్సరీ పీపుల్స్ కోసం తయారు చేయబడుతుంది. ఈ వెహికల్స్ కు సెపరేట్ అవుట్ లెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే టాటా నెక్సాన్  టాటా వాహన ప్రియులకు బాగా నచ్చింది.  


అయితే వాహనాల ధర పెరగడం వల్ల ఈ ప్రభావం సేల్స్ మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వెహికల్ కొనుగోలు మీద ఆకర్షణీయమైన బహుమతులు అందచేస్తున్నారట. ఇది ఏరియాని బట్టి డిసైడ్ చేస్తారని తెలుస్తుంది. మరి టాటా మోటార్స్ వాహనాల ధర పెరిగినా వాటి ప్రభావం సేల్స్ మీద ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: