ఫోర్డ్ నుండి వచ్చిన ఎకోస్పోర్ట్ వాహనదారుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సరికొత్త హంగులతో ఫోర్డ్ ఎకో స్పోర్ట్ థండర్ మోడల్ లాంచ్ అయ్యింది. మునుపటి ధర కన్నా ఇది కాస్త ఎక్కువ ధర పలుకుతుంది. 7.69 లక్షల నుండి 11.33 లక్షల వరకు మోడల్ ను బట్టి ఈ వెహికల్ ధర నిర్ణయించబడింది. 


ఫోర్డ్ ఎకో స్పోర్ట్ పెట్రోల్ మొడల్ 10.18 లక్షలు కాగా.. డీజిల్ 10.68 లక్షలకు అందుబాటులో ఉంది. 123 బి.హెచ్.పి, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటుగా 100 బి.హెచ్.పి, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో ఈ వెహికల్ వస్తుంది. ఎకో స్పోర్ట్ టైటానియం, ఎస్ వేరియెంట్స్ వెహికల్స్ లానే ఎకో స్పోర్ట్ థండర్ కూడా 125 బి.హెచ్.పి, 1.0 లీటర్ ఎకో బూస్ట్ టర్బో పెట్రోల్ మోటర్ ను కలిగి ఉంటుంది.


ఆల్రెడీ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వెహికల్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రాబోతున్న ఎకో స్పోర్ట్ థండర్ కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఫోర్డ్ ఆల్రెడేఎ వెహికల్ లాంచ్ చేయగా త్వరలోనే అన్ని అవుట్ లెట్స్ కు ఈ వెహికల్ వచ్చేస్తుంది. ఎస్.యు.వి వెహికల్ కావాలనుకునే వారికి ఫోర్డ్ మంచి ఆప్షన్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: