టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వెహికల్ ఏదైనా సరే ఇన్సూరెన్స్ కంపల్సరీ.. వాహనాల ధరను బట్టి ఈ ఇన్సూరెన్స్ ధరలు నిర్ణయించబడి ఉంటాయి. అయితే ఇన్సూరెన్స్ రెగ్యులెటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆర్డర్ ప్రకారం ఇన్నాళ్లు ఉన్న వెహికల్ ఇన్సూరెన్స్ ధరలు పర్సెంటేజ్ ల ప్రకారంగా పెంచడం జరిగింది. వెహికల్ మోడల్, కెపాసిటీని బట్టి ఇన్సూరెన్స్ ధరలు పెంచారు.  


ఫోర్ వీలర్స్ విభాగానికి వస్తే.. 1000 cc కెపాసిటీ కన్నా తక్కువ ఉన్న వెహికల్స్ కు అంతకుముందు సంవత్సరానికి 1850 ఇన్సూరెన్స్ ప్రైజ్ ఉండగా అది ఇప్పుడు 2072 కు మార్చారు. ఇంతకుముందు ఉన్న ప్రైజ్ కు 12 పర్సెంట్ పెంచారు. 1000cc నుండి 1500cc మధ్య గల వాహనాలకు 12.5 పర్సెంట్ రేటు పెంచారు. అంటే ఇదవరకు 2863 ప్రీమియం ఉండగా అది 3221కి మారింది.  


టూ వీలర్ విభాగానికి వస్తే 75cc కంటే తక్కువ ఉన్న బైకులకు 12.9 పర్సెంట్ ప్రైజ్ హైక్ చేశారు. 75cc నుండి 150cc వరకు గల టూ వీలర్స్ కు 4.4 పర్సెంట్ మాత్రమే ప్రీమియం పెంచారు. అంటే ఇదవరకు 720 ప్రీమియం ఉంటే అద్ 752 వరకు పెంచారు. 150cc నుండి 350cc గల టూ వీలర్స్ కు అత్యధికంగా 21.1 పర్సెంట్ ప్రైజ్ హైక్ చేశారు. అంటే 985 ప్రీమియం ఉన్న వాటికి కొత్త రేటు 1193 రూపాయలు ఫిక్స్ చేశారు. 350ccకెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్న టూ వీలర్స్ కు 2323 ప్రీమియం నిర్ణయించారు. పెరిగిన ఈ రేట్లు జూన్ 16, 2019 నుండి అమలుకానున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: