హోండా నుండి స్కూటర్ విభాగంలో మొదటి బిఎస్-4 టూ వీలర్ రాబోతుంది. హోండా యాక్టివా బిఎస్-4 టూ వీలర్ సరికొత్త హంగులతో వస్తుంది. స్కూటర్ విభాగంలో బిఎస్-4 తో వస్తున్న టూ వీలర్ ఇదే అవడం విశేషం. 125 సిసి కెపాసిటీతో ఫ్యుయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ తో ఈ స్కూటర్ వస్తుంది.


అంతేకాదు ఎల్.ఈ.డి హెడ్ లైట్ తో పాటుగా డిజిటల్ డిస్ ప్లే కూడా అందుబాటులో ఉంటుంది. సెమి డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్ కలిగిన ఎల్.ఈ.డి హెడ్ ల్యాంప్ తో వస్తుంది. హోండా నుండి వస్తున్న మొదటి బిఎస్ 4 స్కూటర్ గా ఇది ప్రత్యేకతంగా ఉండబోతుంది. టెక్నికల్ అప్డేట్స్ తో కస్టమర్స్ కు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ స్కూటర్ బాగుంటుంది.


హోండా యాక్టివా సేల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. స్కూటర్ విభాగంలో మిగతా మోటార్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇక ఈ సరికొత్త హోండా బిఎస్ 4 స్కూటర్ హీరో మేస్ట్రో ఎడ్జ్ 125, టివిఎస్ ఎన్ టార్క్ 125 స్కూటర్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. హోండా యాక్టివా 125 ప్రస్తుతం 64,733 ఢిల్లి మార్కెట్ ప్రైజ్ తో అందుబాటులో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: