కె.టి.ఎం మోటార్స్ నుండి ఆర్సి 125 మోడల్ రెడీ అవుతుంది. దీనికి సంబందించిన టెస్ట్ డ్రైవ్ టీజర్ వీడియో బయటకు వచ్చింది. కె.టి.ఎం నుండి ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ వెహికల్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఆస్ట్రియా దిగ్గజ మోటార్ కంపెనీ కె.టి.ఎం డ్యూక్ 125 ను 2018లో రిలీజ్ చేశారు. 


భారత మార్కెట్ లో బ్రాండ్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్ గా కె.టి.ఎం కు మంచి గుర్తింపు వచ్చింది. స్పోర్టివ్ డిజైన్ తో హయ్యెస్ట్ రేసింగ్ పర్ఫార్మెన్స్ దీని ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. కె.టి.ఎం నుండి వస్తున్న సరికొత్త ఆర్సి 125 అంతకుముందు మోడల్ ఆర్సి 200 భాగాలు తీసుకుని దీన్ని తయారు చేయడం జరిగింది.


124సిసి లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ 14.3 బి.హెచ్.పి, 12 ఎన్.ఎం టార్క్ పవర్ ఇస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ బైక్ కె.టి.ఎం లవర్స్ కు మరింత ప్రియం కానుంది. ఇక ఈ బైక్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న యమజా ఎస్.ఎఫ్ ఆర్ 15 3.0, సుజుకి జిక్సర్ ఎస్.ఎఫ్ 155 లకు గట్టి పోటీ ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: