స్కోడా నుండి వచ్చిన ర్యాపిడ్ లక్ష యూనిట్స్ అమ్ముడై సరికొత్త రికార్డ్ సృష్టించింది. స్కోడా నుండి 2011లో మొదలైన ర్యాపిడ్ వెహికల్ 2016లో టెక్నికల్ అప్డేట్స్ తో వచ్చింది. ఇక అప్పటి నుండి స్కోడా ర్యాపిడ్ సేల్స్ బాగా పెరిగాయి. ప్రస్తుతం 4 డిఫరెంట్ వేరియెంట్స్ లో స్కోడా ర్యాపిడ్ అందుబాటులో ఉంది.


ఇక ప్రైజ్ విషయానికొస్తే 8.82 లక్షల నుండి 14.26 లక్షల వరకు ఈ వెహికల్ ప్రైజ్ ఉంది. ఇక 2021 కల్లా నెక్స్ట్ జెనరేషన్ స్కోడా ర్యాపిడ్ వెహికల్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రాబోతున్న ఈ వెహికల్ హెవీలీ లోకలైజ్ వర్షన్ గా వస్తుంది. ఇంజిన్ విషయానికొస్తే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది.


ఇక రాబోయే వెహికల్స్ అన్ని డీజిల్ తో ప్రొడక్షన్ ఆపేసి కేవలం పెట్రోల్ తోనే నడిపించాలని చూస్తున్నారు. ఆల్రెడీ ఇతర మోటార్ కంపెనీలు డీజిల్ మోడల్ ను తయారు చేయడం కూడా నిలిపివేశారు. మరి స్కొడా ర్యాపిడ్ సరికొత్త హనులు స్కోడా సేల్ పెంచేలా చేస్తుందేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: