దేశంలో అత్యధిక వెహికల్స్ సేల్ అవుతున్న మారుతి సుజుకి నుండి వచ్చిన మారుతి సుజుకి డిజైర్ 10 ఏళ్ల కాలంలో 19 లక్షల కార్లను సేల్ చేసినట్టు తెలుస్తుంది. 2018-19 సంవత్సరం లో ఏకంగా 2.5 లక్షల కార్లు అమ్ముడయ్యాయని సమాచారం. అంటే ఎలా లేదన్నా యావరేజ్ గా నెలకు 21,000 యూనిట్లు సేల్ అయినట్టు లెక్క.   


అలా చూస్తే మారుతి సుజుకి డిజైర్ ప్రతి రెండు నిమిషాలకు ఓ కారు సేల్ అవుతున్నట్టే. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ లో మారుతి సుజుకి డిజైర్ సేల్స్ ను బీట్ చేసే వారే లేరని చెప్పొచ్చు. మారుతి సుజుకి ప్రయాణంలో డిజైర్ పాత్ర చాలా కీలకం. మొదటి కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ వెహికల్ గా ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది.  


2017లో మారుతి సుజుకి డిజైర్ థర్డ్ జెనరేషన్ కారుని లాంచ్ చేసింది. ఈ కారు మునుపటి సేల్స్ ను మరింత పెంచేసింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తున్న ఈ వెహికల్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 82 బి.హెచ్.పి పవర్, 113 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంద్. డీజిల్ ఇంజిన్ అయితే 73 బి.హెచ్.పి పవర్, 189 ఎన్.ఎం టార్క్ తో ఇది వస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 22 కె.ఎం.పి.ఎల్ ఇస్తే.. డీజిల్ ఇంజిన్ 28 కె.ఎం.పి.ఎల్ వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: