దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థల్లో మారుతి సుజికి ఒకటి.  ఈ కంపెనీ నుంచి అనేక వెర్షన్ కార్లు వచ్చాయి.  త్వరలోనే ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయబోతున్నది.  2020 నాటికి ఈ కార్లను రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.  ఇందుకోసం దేశంలో 300 సర్వీస్ అవుట్ లెట్లను ప్రారంభించాలని కంపెనీ ప్రణాళిలు సిద్ధం చేసింది.  


నెక్సా బ్రాండ్ పట్ల కంపెనీ ఎంత శ్రద్ధ పెడుతోందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మారుతి సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును 2020లో విడుదల చేయాలని భావిస్తోంది. తన పోర్ట్ ఫోలియోలో ఈవీ కార్లను చేర్చుకొనడానికి ముందుగా కంపెనీ తన నెట్ వర్క్ విస్తరణ ప్రారంభించింది.మారుతి సుజుకి ఇప్పటికే భారత్ లో వేగన్ ఆర్ పై ఎలక్ట్రిక్ కార్ పరీక్షించి చూసింది.

2020 నుంచి లిథియం ఇయాన్ బ్యాటరీలు తయారు చేస్తామని, అందుకోసం ఒక బ్యాటరీ ప్లాంట్ స్థాపిస్తామని ప్రకటించింది. భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల పరీక్షకు 2018 వేగన్ ఆర్ మోడల్ ను మారుతి సుజుకి ఉపయోగిస్తోంది. భారత్ లో విడుదల చేసే కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు కూడా అదే అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల కార్యక్రమాన్ని టొయోటా మోటార్ కార్పొరేషన్ సహాయ సహకారాలతో నిర్వహిస్తారు. ఈ మేరకు మారుతి సుజుకీకి టొయోటాకి మధ్య వెహికిల్ షేరింగ్ జాయింట్ వెంచర్ కుదిరింది. ప్రీమియం వాహనాలుగా మార్కెట్లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ ఫోలియోకి నెక్సా డీలర్ షిప్ ను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. 


ఎలక్ట్రిక్ కార్ ధర రూ.8 లక్షల పైచిలుకే కావచ్చని భావిస్తున్నారు. మాములు డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే ఇది పెద్ద ధర కాదు.  పైగా ఎలక్ట్రిక్ కారు కాబట్టి ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది.  వాతావరణానికి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు.  మరి మన దేశంలో ఈ తరహా వాహనాలు సక్సెస్ అవుతాయంటారా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: