రానున్న రోజుల్లో వెహికల్స్ అన్ని ఎలెక్ట్రిక్ వాహనాలే అవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే డీజిల్ వెహికల్స్ తగ్గించేస్తున్న మోటార్ కంపెనీలు ప్రస్తుతం ఎక్కువగా పెట్రోల్ వాహనాలనే అందిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పెట్రోల్ వెహికల్స్ కూడా ఆపేసి పూర్తిగా ఎలెక్ట్రిక్ వెహికల్స్ రిలీజ్ చేస్తారట. పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కు అలవాటు పడ్డ వాహనదారులు అంత త్వరగా వాటిని వదిలేస్తారా.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ వెహికల్స్ తయారీ ఆపేస్తే కొత్తగా కొనే వారు కూడా ఉండరు. 


పెట్రోల్, డీజిల్ వెహికల్స్ బదులుగా ఎలెక్ట్రిక్ వెహికల్స్ సిద్ధం చేస్తారట. త్వరలో బిఎస్-6 నామ్స్ ప్రకారంగా వెహికల్స్ సిద్ధం చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. అయితే డీజిల్ వెహికల్స్ బిఎస్ 6 వెహికల్స్ ఇవ్వాలంటే మోటార్ కంపెనీలకు అధిక పెట్టుబడి అవసరం ఉంటుంది. దాంతో వాహన రేటు పెంచాల్సి వస్తుంది.  


ఉన్న రేటు కన్నా అధిక రేటు అమ్మితే వాహనదారులు కొనే అవకాశం లేదు. అందుకే బిఎస్ 6 నామ్స్ వస్తే డీజిల్ వెహికల్స్ దాదాపు కనుమరుగవుతాయని తెలుస్తుంది. ఇక త్వరలో పెట్రోల్ వెహికల్స్ ను ఫుల్ స్టాప్ పెట్టి కేవలం ఎలెక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే తయారు చేసేలా మోటార్ కంపెనీలకు సూచనలు ఇస్తున్నారు. పొల్యూషన్ సమస్య వల్లే డీజిల్, పెట్రోల్ వెహికల్స్ రద్దు చేయడం జరుగుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: