టూవీలర్ బైకులలో మంచి క్రేజ్ ఉన్న యమహా ఇప్పుడు స్కూటర్ విభాగంలో కూడా ఎక్కువ ఉత్పత్తులను తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే యమహా నుండి కొన్ని స్కూటర్స్ అందుబాటులో ఉండగా వచ్చే ఏడాది సరికొత్త ప్రీమియర్ 155 సిసి స్కూటర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


యమహా నుండి వచ్చే ఏడాది ఎన్ మ్యాక్స్ 155 ప్రీమియం స్కూటర్ లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. స్కూటర్ విభాగంలో ఇప్పటివరకు 125 సిసి కెపాసిటీతోనే అన్ని మోటార్ కంపెనీల వెహికల్స్ వచ్చాయి. కాని యమహా మొదటిసారి 155 సిసి కెపాసిటీతో ఎన్ మ్యాక్స్ ను రిలీజ్ చేస్తుంది. ఇది స్పోర్టివ్ స్కూటర్ గా డిజైన్ చేయబడింది.


ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వెస్పా, ఏప్రిలియా స్కూటర్స్ కు గట్టి పోటీ ఇచ్చేల యమహా ఎన్ మ్యాక్స్ రిలీజ్ చేస్తున్నారు. 155 సిసి కెపాసిటీ, సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ తో ఈ వెహికల్ వస్తుంది. 8000 ఆర్పిఎం వద్ద 14.5 బి.హెచ్.పి, 6000 ఆర్పిఎం వద్ద 14.4 బి.హెచ్.పి తార్క్ ఉత్పత్తి అవుతుంది. ఈ స్కూటర్ ధర లక్ష వరకు ఉండొచ్చని అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి: