టాటా మోటార్స్ నుండి త్వరలో కొత్తగా 6 వెహికల్స్ లాంచ్ అవబోతున్నట్టు తెలుస్తుంది. టాటా హ్యారియర్ ఎస్.యు.వి విభాగంలో రిలీజై కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక ఇప్పుడు టాటా మోటార్స్ కొత్తగా 6 వెహికల్స్ లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.


టాటా నుండి సరికొత్త ఆల్ట్రోజ్ 2019 ఫెస్టివల్ సీజన్ గా రిలీజ్ చేస్తున్నారు. టాటా నుండి రాబోతున్న మరో హ్యాచ్ బ్యాక్ వెహికల్ గా ఆల్ట్రోజ్ వస్తుంది. 2018 ఢిల్లిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఆల్ట్రోజ్ చూపరులను ఆకట్టుకుంది. ఈ వెహికల్ హ్యుండై ఐ20, హోండా జాజ్, మారుతి సుజుకి బలెనో లాంటి వెహికల్స్ కు పోటీ ఇస్తుంది.


ఇక ఇదే కాకుండా 2020లో టాటా నుండి 7 సీటర్ వెహికల్ రాబోతుందని తెలుస్తుంది. టాటా హ్యారియర్ బిఎస్ 6 ఆటోమెటిక్ వెహికల్ కూడా 2020 కల్లా వస్తుందట. టాటా నుండి హెచ్2ఎక్స్ హార్న్ బిల్ మైక్రో ఎస్.యు.వి వెహికల్ కూడా లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. 2020 తర్వాత ఈ వెహికల్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా టాటా టైగో, నెక్సన్ ఫేస్ లిఫ్ట్ వెహికల్స్ కూడా రిలీజ్ చేయాలని చూస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం టాటా వెహికల్స్ కొనాలనుకునే వారు ఈ సరికొత్త వెహికల్స్ ఓసారి ట్రై చేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: