తమ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు మోటార్ కంపెనీలన్ని అధునాతన టెక్నికల్ అప్డేట్స్ తో వెహికల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ ఇప్పటికే ఎన్నో కొత్త వెహికల్స్ లాంచ్ అవగా ఆగష్టులో ఐదు కొత్త వెహికల్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే హ్యుండై గ్రాండ్ ఐ10. ఈ వెహికల్ ను ఫుల్ అప్డేటెడ్ వర్షన్ తో రిలీజ్ చేస్తున్నారు. ఆగష్టు 20న ఈ వెహికల్ లాంచ్ అవనుంది.


ఇక ఆగష్టులో మారుతి నుండి ఎక్స్.ఎల్6 వెహికల్ కూడా రిలీజ్ అవుతుంది. మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్ ఓవర్ చేస్తూ సరికొత్త ఎక్స్.ఎల్.6 వస్తుంది. ఆగష్టు 21 ఈ వెహికల్ ఇండియా మార్కెట్ లోకి వచ్చేస్తుంది. వీటితో పాటుగా బి.ఎం.డబల్యు 3 సీరీస్ వెహికల్ కూడా ఆగష్టులో లాంచ్ అవుతుంది.


ఇక సరికొత్త సంచలనం కియా సెల్టోస్ కూడా ఆగష్టులో లాంచ్ అవుతుంది. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లో కియా మోటార్స్ షోరూం లు ఓపెన్ చేసింది. ఇక వీటితో పాటుగా రెనాల్ట్ నుండి ట్రైబర్ కూడా వస్తుంది. రెనాల్ట్ క్విడ్ కు మోడిఫైడ్ వర్షన్ గా రెనాల్ట్ ట్రైబర్ వస్తుంది. మరి రాబోతున్న ఈ ఆగష్టులో కొత్త వెహికల్స్ తో మార్కెట్ అంతా సందడిగా మారబోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: