టూ వీలర్ రైడింగ్ లో అత్యంత సౌకర్యవంతంగా ఉండి.. తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న యమహా మోటర్ బైకులలోనే కాదు స్కూటర్స్ విభాగంలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. యమహా నుండి వస్తున్న స్కూటర్స్ కు ప్రత్యేకత ఏర్పడింది. ప్రస్తుతం యమహా నుండి కొత్త స్కూటర్ రాబోతుంది. అదే యమహా సిగ్నస్ రే జెడ్.ఆర్.    


మోన్ స్టర్ ఎనర్జీ యమహా మోటో జిపి ఎడిషన్ గా ఈ స్కూటర్ రాబోతుంది. 59,028 ఢిల్లి ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ వెహికల్ వస్తుంది. 113 సిసి కెపాసిటీతో సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ సిస్టెంతో ఈ వెహికల్ వస్తుంది. 7.1 bhp, 8.1 nm టార్క్ తో యమహా సిగ్నస్ రే జె.ఆర్ వస్తుంది.


ఈ వెహికల్ 5 కలర్స్ తో రిలీజ్ అవుతుంది. బ్లూ, గ్రీన్, మవరిక్ బ్లూ, రూస్టర్ రెడ్, డార్క్ లైట్ కలర్స్ తో వస్తుంది. త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ కానున్న ఈ వెహికల్ యమహా స్కూటర్ విభాగంలో సేల్స్ పెంచుతుందని అంటున్నారు. ఈ స్కూటర్ తో పాటుగా యమహా ఆర్15 వర్షన్ 3.0, ఎఫ్.జెడ్ 25 కూడా రిలీజ్ చేస్తున్నారు యమహా మోటార్స్.      


మరింత సమాచారం తెలుసుకోండి: