హీరో మోటార్స్ నుండి సరికొత్తగా రెండు ఎలెక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసింది. అందులో ఒకటి Otima ER, రెండోది Nyx ER. ఈ స్కూటర్స్ డ్యుయల్ లిథియం ఇయాన్ బ్యాటరీస్ తో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 4 గంటల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఇక ఈ స్కూటర్స్ కు 5 ఇయర్స్ బ్యాటరీ  లైఫ్ ఇస్తున్నారు.    


అయితే ప్రాపర్ కేర్, మెయిటెనన్స్ వల్ల ఇది 5 ఇయర్స్ వాలిటీ ఉంటుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కు డిమాండ్ పెరుగుతుంది. అందుకే హీరో మోటార్స్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ప్రత్యేక సబ్సీడి ఇస్తున్నారు. హీరో నుండి వస్తున్న ఈ Otima ER, Nyx ER 71543, 72566 ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది.   


ఇతర మోటార్ కంపెనీలు కూడా ఎలట్రిక్ స్కూటర్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. టివిఎస్, యమహా మోటార్స్ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. హీరో పెట్రోల్ టూ వీలర్ వాహనాలతో పాటుగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కు మంచి సేల్స్ కలిగి ఉంటాయని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: