జపాన్ ప్యాసింజర్ కార్ల సంస్థ టయోటా మోటార్స్ మార్కెట్ లోకి కొత్తగా యారిస్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ లాంచ్ చేసింది. 8.65 లక్షల ప్రారంభ ధరతో ఈ వెహికల్ వస్తుంది. టయోటా యారిస్ రెండు వేరియెంట్స్ లో అందుబాటులో ఉంటుంది. యారిస్ జె-ఆప్షనల్, వి-ఆప్షనల్ అనే రెండు వేరియెంట్స్ లో ఈ వెహికల్ వస్తుంది.   


1.5 పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఈ వెహికల్ 6 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ గేర్స్ అందుబాటులో ఉంది. 106 బి.హెచ్.పి పవర్, 140 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టయోటా జె-ఆప్షనల్ వేరియెంట్ వెహికల్ మ్యాన్యువల్ గేర్స్ వెహికల్ 8.65 లక్షలతో వస్తుండగా ఆటోమెటిక్ గేర్ బాక్స్ కలిగిన వెహికల్ 9.32 లక్షలతో లాంచ్ అయ్యింది.     


ఇక టయోటా వి ఆప్షనల్ యారిస్ వెహికల్ మ్యాన్యువల్ గేర్స్ తో అయితే 11.97 లక్షల ప్రైజ్ ఫిక్స్ చేయగా.. ఆటొమెటిక్ గేర్స్ తో వస్తున్న వెహికల్ 13.17లక్షలుగా ప్రైజ్ డిసైడ్ చేశారు. టయోఆ సరికొత్త యారిస్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ ఎన్నో కొత్త ఫీచర్లతో వస్తుంది. 7 సీటర్ వెహికల్ గా వస్తున్న ఈ టయోటా యారిస్ టయోటా సేల్స్ ను పెంచే అవకాశం కనిపిస్తుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: