ఒకప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించటం అంటే లైట్ తీసుకునే వాహన దారులు ... ఇప్పుడు మాత్రం చాలా శ్రద్దగా ట్రాఫిక్ రూల్స్  పాటిస్తున్నారు . ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే మహా అయితే  చలాన్లు కడతాం అనుకునే వాహన దారులు... చలాన్లు వద్దు రూల్స్ పాటించటమే ముద్దు అంటున్నారు ఇప్పుడు. దీనంతటికి కారణం భారీగా పెరిగిన ట్రాఫిక్ చలాన్లు .దీంతో ఒక్కసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయిన జేబుకి  చిల్లు పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది . దీంతో అందరు రూల్స్ పాటించక తప్పడం లేదు . కేంద్రం భారీగా జరిమానా పెంచటం పట్ల  పలువురు వాహన దారులు నిరసన కూడా వ్యక్తం  చేశారు .


దీని పై స్పందించిన  కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ చట్ట సవరణ నిర్ణయాన్ని  సమర్థించుకున్నారు .మన దేశంలో ఎక్కువ మంది రోడ్ ప్రమాదాల వల్లే ప్రాణాలు కోల్పోయారన్నారు . ట్రాఫిక్ చలాన్ల వల్ల కేంద్రానికి ఆదాయం పెరుగుతుందని ఈ చట్టాన్ని సవరణ చేయలేదని ... దేశ ప్రజల ప్రాణాలని కాపాడే బాధ్యత తమపై ఉందని... అందుకే ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మాత్రమే ఈ చట్ట సవరణ చేశామని తెలిపారు .అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం ప్రకటించిన  చట్ట సవరణను  తమ తమ రాష్ట్రాలలో అమలు చేయకుండా ...జరిమానాలు తగ్గిస్తుండటం పై స్పందించిన గడ్కరీ .మోటార్ చట్టాల సవరణను కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిధిలో సవరణ  చేసుకోవచ్చని తెలిపారు .అయితే భారీగా చలాన్లు పెంచినప్పటి నుండి చాలా మంది రూల్స్ ని పట్టిస్తున్నారన్నారు . జరిమానాలు కంటే ప్రాణాలుముఖ్యం కాదా అని గడ్కరీ అన్నారు .అయితే సక్రమంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే జరిమానాలు కట్టాల్సిన అవసరమే  ఉండదు కదా అన్నారు.కొత్త సవరణ చట్టం తర్వాత చాలా మంది లైసెన్సులు ఇతర డాక్యుమెంట్లు తీసుకునేందుకు ముందుకొస్తున్నారన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: