సెప్టెంబర్ 1  న  దేశంలో వాహనదారులు అందరి గుండెలు గుబేలుమన్నాయి . ఎందుకంటే ఆ రోజే కదా కేంద్రం కొత్త వాహనం చట్టాన్ని అమలు చేసింది . ఇన్ని రోజు లు వందల్లో ఉన్న జరిమానాలు ...వేలల్లోకి మారాయి .ఇప్పుడు వాహన దారుల పరిస్థితి గీత దాటితే వాత పడుద్ది అన్నట్లుగా ఉంది . ఒకవేళ మనం సిగ్నల్ క్రాస్ చేసిన ...రాంగ్ రూట్ లో పట్టుబడిన ఇలా ఏ  ట్రాఫిక్  నిబంధన అతిక్రమించిన సరే  ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఉన్న  కెమెరాలతో ఒక్కసారి క్లిక్ మనిపిస్తే చాలు ... చలాన్ రసీదు మొబైల్ కి వచ్చేస్తుంది . రోడ్లు సరిగ్గా వేయకుండానే ...ట్రాఫిక్ నిర్వహణ క్రమ బద్దికరించకుండా ఇంత భారీగా చలాన్లు ఎలా విదిస్తారంటూ  పలువురు వాహన దారులు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసందే . చలాన్ పడ్డాక జేబు చిల్లు చేసుకోవటం కంటే ..ముందు  జాగ్రత్తతో సిగ్నల్ పాటించేందుకు ఎక్కువ మంది వాహన దారులు మొగ్గు చూపుతున్నారు .


 
అయితే ఈ అధిక చలాన్ల వ్యవహారం మన దేశంలోనే కాదండోయ్ ... పక్క దేశాల్లో మన దేశం కంటే ఎక్కువ ఉంది .అమెరికాలో ఉన్నచలాన్లు  చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే . హెల్మెట్ లేకపోతే 300  డాలర్లు , లైసెన్స్ లేకపోతే 1000  డాలర్లు , సీట్ బెల్ట్ లేకపోతే 25  డాలర్లు చలానా విధిస్తారు . అమెరికాలో ఉన్న చలాన్లు చూస్తేనే ఇలా ఉంటె... ఇక దుబాయ్ లో అయితే ఓ వింత చలాన్  కూడా విధిస్తారు .అదేంటో తెలుసా వాహనాలు నీట్ గా లేకుండా మురికిగా ఉన్న యజమానులకు 500   దిర్హామ్‌ల చలాన్ విదిస్తారట . ఈ చలాన్లు చూస్తుంటే అనిపిస్తుంది కదా ... మన దేశంలోనే బెటర్ అని .


మరింత సమాచారం తెలుసుకోండి: