భారత దేశంలో కాశ్మీర్  భూభాగం అయినప్పటికీ 370    ఆర్టికల్ అమలు  తో  కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండగా ... ప్రధాని మోడీ సంచలనం నిర్ణయం తో 370  ఆర్టికల్ ని రద్దు చేశారు . దీంతో భారత దేశంలోని మిగితా రాష్ట్రాల్లో అమలయ్యే చట్టాలు పథకాలు కాశ్మీర్ లోను  అమలవుతాయని అందరికి తెలిసిన విషయమే . అయితే 370  ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ భారత్ పై ఎన్నో కుట్రలు కుతంత్రాలు  పన్నుతోంది . ఈ నేపథ్యంలో పాక్ భారత్ తో ఉన్న  ద్వైపాక్షిక సంబంధాలు నిలిపి వేసింది . దీంతో భారత్ పాకిస్థాన్ మధ్య   ఎగుమతులు దిగుమతులు ఇతర ఒప్పందాలు అన్ని రద్దు చేసుకుంది పాకిస్థాన్ .


370  ఆర్టికల్ రద్దు అనంతరం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ...అంతర్జాతీయ వేదిక పై భారత్ ని దోషిగా  చూపించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు .అయితే ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో  58 దేశాలు   పాకిస్తాన్‌కే మద్దతుగా ఉన్నాయని పాకిస్థాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ట్విట్ ఉద్దేశిస్తూ పాక్ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు . ప్రపంచం మొత్తం భారత్  వాదనని విశ్వసిస్తుందని పాక్ మంత్రి తెలిపారు ... కాశ్మీర్‌లో కర్ఫ్యూ వివిధించటం తో  మెడిసిన్స్ లేక  కాశ్మీర్ ప్రజలు  ఇబ్బందులు ఎదురుకుంటున్నారు . కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనం జరుగుతోందని మేమందరం  చెబుతున్నప్పటికీ ...  మా మాటని ఎవరూ నమ్మడం లేదు.  . ప్రపంచం మొత్తం భారత్ వైపే ఉందని ...పాకిస్థాన్ ఎవరు విశ్వసించటం లేదని పాక్ మంత్రి  సంచలనం వ్యాఖ్యలు చేసాడు .కాశ్మీర్ విషయంలో ఇమ్రాన్ ఖాన్ తీరు సరైనది కాదంటూ పాక్ మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: