స్వలింగ సంపర్కం నేరం కాదని 2018  లో  సుప్రీమ్ కోర్టు తీర్పు నిచినప్పటికీ ...ఈ విషయానికి సంబంధించి సమాజంలో  ఇప్పటికి పూర్తి అవగాహన మాత్రం రాలేదు . స్వలింగ సంపర్కులగా  ఉండటం అదొక లోపంగా భావిస్తున్నారు . స్వలింగ సంపర్కులగా  ఉన్న వాళ్ళని విచిత్రంగా ట్రీట్ చేయటం చేస్తుంటారు . వాళ్ళు ఏం చేసిన తప్పుగానే పరిగణిస్తుటారు . ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది .కూతురు ఒక   లెస్బియన్ అని తెలిసి  దాన్ని అవమానంగా భావించి ఆత్మ హత్య చేసుకున్నాడు ఓ తండ్రి  .


వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని షాదార ఫర్స్ బజార్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబం తో నివసితున్నాడు . అయితే ఆ వ్యక్తి చిన్న కూతురు మరో  యువతితో రిలేషన్ షిప్ లో  ఉన్నట్టు తెలియటం తో నిలదీసాడు .దీంతో తానొక లెస్బియన్ అని ... యువతితో లెస్బియన్ రిలేషన్ షిప్‌లో కొనసాగుతానని తెగేసి చెప్పింది. ఈ రిలేషన్ షిప్ ని వదులుకొమ్మనీ తండ్రి సూచించగా ...యువతీ ససేమిరా అంది ...దీంతో   తండ్రి కూతుర్ల మధ్య వాగ్వాదం పెరిగి పెద్దగా అరవటం స్టార్ట్ చేశారు . వీళ్ళ అరుపులు విన్న ఇరుగు పొరుగు వాళ్ళు ఆయన  ఇంటి వద్ద గుమిగూడారు .దీంతో తన చిన్న కూతురు ఒక లెస్బియన్ అన్న విషయం అందరికి తెలిసిపోయింది. అయితే ఈ విషయాన్ని అవమానంగా భావించిన ఆ వ్యక్తి బయటకి వెళ్లి తుపాకీ తో ఇంట్లోకి వచ్చాడు . అందరు చూస్తుండగానే తుపాకీతో కాల్చుకున్నాడు ...అయితే కుటుంబ సభ్యులు అంబులెన్స్ కి ఫోన్ చేసినప్పటికీ అప్పటికే ఆలస్యం అవ్వటం తో ఆ వ్యక్తి చని పోయాడు . అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీమ్ తీర్పునిచినప్పటికీ అక్కడ అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: