ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరనానికి ముప్పు వాటిల్లుతుంది అని తెలిసినప్పటికీ ప్లాస్టిక్ వాడకం  మాత్రం తగ్గటం లేదు. ప్లాస్టిక్  నిషేధం చేయాలనీ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కడ మార్పు మాత్రం రావటం లేదు. ఇక పట్టణాలు, నగరాలు అయితే అవసరానికి మించి ప్లాస్టిక్ వాడుతుంటారు. ఈ కాలంలో రోజు వారి అవసరం అయిపొయింది ప్లాస్టిక్ వాడకం. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేదానికి ఎన్నో నిబంధనలు విదించిన ఫలితం లేకుండా పోయింది. అయితే ప్లాస్టిక్ ని నిషేదించటం కన్నా... చెత్త కుప్పల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ ని తిరిగి ఉపయోగం లోకి  తీసుకు రావటం మేలు అని గ్రహించిన అధికారులు వినూత్న ప్రయత్నానికి  శ్రీకారం చుట్టారు  అక్కడి అధికారులు. దీనికోసం మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. 

 

 

చత్తిస్ గడ్ రాష్ట్రం లోని అంబికా పూర్ కి చెందిన కార్పొరేషన్  అధికారులు... పర్యావరణం కాపాడటానికి ఓ వినుత్న ఆలోచన చేసారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొచ్చి ఇస్తే ఆహారాన్ని ఉచితంగా పెడతామంటూ ఆఫర్ చేసారు. ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొస్తే లంచ్ ఫ్రీగా పెడతామని... అరకిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు తీసుకొస్తే బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతామని ఆఫర్ పెట్టారు అధికారులు. కాగా దీని కోసం వీరు గార్బేజ్ కేఫ్ అనే కేఫ్ ని కూడా ఏర్పాటు చేశారు. కాక ఇక్కడికి అప్పుడప్పుడు ప్రజలు వచ్చి తమ దగ్గరున్న ప్లాస్టిక్ ఇచ్చి   భోజనం చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ కవర్లు ఏరుకునే  వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకో గలుగుతున్నారు. అయితే ఈ వినూత్న ఆలోచన ద్వారా అధికారులు చాలా సేకరించడం తో పాటు వాటిని తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తున్నారు. అధికారుల ఈ వినూత్న ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: