కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ చట్టం తో వాహన దారులు బెంబేలెత్తి పోతున్నారు.  ఎక్కడ గీత దాటితే వాత పడుతుందో అని భయపడుతున్నారు. అయితే ఈ నూతన మోటార్ చట్టం  పై చాలా చోట్ల వాహన దారులు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఈ నూతన మోటార్ చట్టం అమలు తర్వాత ఓ లారీ భారీగా 6 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  కాగా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన నూతన మోటార్ వాహనాల చట్టాన్ని తమ తమ రాష్ట్రాలలో అమలు చేయకుండా... తమ రాష్ట్రాల పరిధిలో ట్రాఫిక్ జరిమానాలను తగ్గించుకున్నాయి 

 

 

ఈ నేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించినా ట్రాఫిక్ జరిమానాలు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  కూడా కేంద్రం విధించిన బారి జరిమానాలతో తమ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకి గురి చేయలేమని... అందుజేత  కొత్త మోటార్ చట్టాన్ని తమ రాష్ట్రంలో ప్రకటించింది. దీంతో  తెలంగాణాలో కూడా ఈ కొత్త మోటార్ చట్టాన్ని అమలు చేయబోము అంటూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా కేంద్రానికి అధిక  లాభం చేకూరుతుందని ఈ నూతన మోటార్ చట్టాన్ని ప్రవేశ పెట్టాలని... ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత తమపై ఉంది కాబట్టే ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టామని తెలిపిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: